మట్టి విగ్రహాలని ప్రతిష్టించాలి..ఎమ్మెల్యే పాయల్ శంకర్
ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదివారం వినాయక చవితి సందర్భంగా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ, “ముఖ్యమైన శుభకార్యాలకు ముందు గణనాయకుడిని పూజించడం ఆనవాయితీ. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, మట్టి విగ్రహాల ప్రతిష్ఠ చేయడం కాలుష్యాన్ని నివారించడానికి తోడ్పడుతుంది” అని అన్నారు.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, మట్టి విగ్రహాల ప్రతిష్ఠకు ప్రాధాన్యం ఇవ్వాలని, హిందూ సంప్రదాయాలను పాటించడం ఎంతో అవసరమని పాయల్ శంకర్ చెప్పారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.