దేశ సమైక్యత సమగ్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని
ఎంపీ గోడం నగేష్
దేశ సమైక్యత సమగ్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీ గోడం నగేష్ అన్నారు. బీజేపీ మహిళ మోర్చ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ఆదిలాబాద్ లో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ఎంపీ గోడం నగేష్ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలను చేతపట్టి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. .

ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ… జాతీయ సమైక్యతను పెంపొందించే దిశగా ప్రతి ఇంటిపై తిరంగా జాతీయ పతకం ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన స్పూర్తితోనే మూడేండ్లుగా ఇంటిపైన జాతీయ జెండాలను ఎగురవేస్తున్నారన్నారు.
ప్రధాని పిలుపుని ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు నేట యువతరం కొత్త తరానికి స్వాతంత్య్ర చరిత్ర తెలియజేయాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 12 నుంచి 14వ తేది వరకు జాతీయ పతకాలను ఇంటిపై ఎగరవేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మందన్, మహిళ మోర్చా అధ్యక్షురాలు ధోని జ్యోతి, నాయకుఉ ఆధినాథ్, విజయ్, ఆకుల ప్రవీణ్, పద్మ, దయాకర్ తదితరులు పాల్గొన్నారు