MP NageshMP Nagesh

ఈ భూమి మీద ఏ జీవరసికైనా హాని చేయని వారు ఎవరున్నారంటే హిందువులే – ఎమ్మెల్యే పాయల్ శంకర్, MP Nagesh

ఈ భూమి మీద ఏ జీవరసికైనా హాని చేయని వారు ఎవరున్నారంటే హిందువులనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని ఖండిస్తూ ఈ ర్యాలీ నిర్వహించగా.. ఎంపీ గొడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మఠాధిపతి యోగానంద సరస్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక గోపాల కృష్ణ మఠం నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేడు బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడుల్లో ప్రతి ఒక్కరు గమనించాలన్నారు.

దేశంలోని కొన్ని రాజకీయ పార్టీల మతల అర్థం చేసుకోవాలన్నారు. ఎవరి కోసం ఆ రాజకీయ పార్టీలు బతుకుతున్నాయని అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న నోరు మెదపని పార్టీలను బొంద పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలో అత్యంత శక్తివంతమైన నరేంద్ర మోడీ ఉన్నందున ఆ టలు చెల్లడం లేదన్నారు . పక్క దేశంలో చిచ్చులు పెట్టి మనదేశంలో కూడా అదేవిధంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. హిందువులు మేలుకోరని పార్టీలు దేశంలో ఉండడానికి వీలు లేదన్నారు.

అనంతరం ఎంపీ మాట్లాడుతూ .. మన సంస్కృతి సాంప్రదాయాలు, ధర్మం చాలా గొప్పది. హిందువులలో ఐక్యత రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మన ధర్మం ఏం చెప్తుందో అందరూ తెలుసుకోవాలన్నారు. అప్పుడే మన సాంస్కృతి సాంప్రదాయాలు ధర్మాన్ని కాపాడుకోగలుగుతామన్నారు.

పాశ్చాత సంస్కృతి సాంప్రదాయాలు వీడ నాడి మాన సాంస్కృతి సాంప్రదాయాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘ నాయకులు రాళ్ల బండి మహేందర్, హనుమాన్లు, ఆకుల ప్రవీణ్, జోగు రవి, ఆదినాథ్, మద్నే సురేందర్ తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *