జూలై 30వ తేదీన మెడల్ మ్యాచ్ జరుగుతుంది.
మరో పథకానికి చేరువలో షూటర్ మనూ భాకర్
పారిస్: పారిస్ ఒలింపిక్స్లో భారత షూటర్లు మెరుగైన ప్రదర్శన ఇస్తున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు బ్రాంజ్ మెడల్ మ్యాచ్కు అర్హత సాధించారు. మనూ భాకర్, సరబీజోత్ సింగ్ జోడి.. ఆ ఈవెంట్లో అర్హత సాధించింది. క్వాలిఫికేషన్ రౌండ్లో ఆ బృందం మూడవ స్థానంలో నిలిచింది.జూలై 30వ తేదీన మెడల్ మ్యాచ్ జరుగుతుంది.ఇక వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ ఈవెంట్లో రమితా జిందాల్ ఏడవ స్థానంలో నిలిచింది. ఆమె 145.3 పాయింట్లు స్కోర్ చేసింది. ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో షూటర్ మనూ భాకర్ .. భారత్ కు కాంస్య పతకాన్ని అందించినా విషయం తెలిసిందే. ఫైనల్లో మనూ భాకర్ 221.7 పాయింట్లు స్కోర్ చేసి మూడవ స్థానంలో నిలిచింది