ఎమ్మెల్యే బర్త్డేకు ఉప్పొంగిన అభిమానం… కార్యకర్తలు.. నేతల తాకిడితో క్యాంప్ కార్యాలయం కిటకిట
వెయ్యి మంది బ్లడ్ డొనేషన్ తో రికార్డు బ్రేక్…

ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారి జన్మదిన వేడుకలు ఆదివారం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు, వివిధ గ్రామాల నుండి తరలి వచ్చిన అశేష ప్రజానీకం పాయల్ శంకర్ గారిని స్వయంగా కలుసుకొని అభినందనలతో ముంచెత్తారు. క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి అందరి సమక్షంలో బర్త్డే జరుపుకున్నారు. ఉదయం పాయల్ శంకర్ కుటుంబ సమేతంగా దుర్గా నగర్ ఆలయంలో , ఆ తర్వాత పట్టణంలోని వెంకటేశ్వర స్వామి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో ఉప్పొంగిన అభిమానంతో కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు.
ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలు జిల్లా, మండల స్థాయి అధికారులు , సిబ్బంది, బీసీ సంఘం ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, డప్పులు వాయిద్యాలతో వివిధ గ్రామాల ప్రజలు తరలివచ్చి బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు.

మెగా బ్లడ్ డొనేషన్ సూపర్ హిట్.. వెయ్యి మందితో రికార్డు బ్రేక్..
ఎమ్మెల్యే పాయలశంకర్ గారి బర్త్ డే సందర్భంగా చాంప్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన రక్తదాన శిబిరం సూపర్ హిట్ అయింది. రిమ్స్ ఆస్పత్రిలో పేదల కోసం స్వచ్ఛందంగా రక్తదానం అందించి కార్యకర్తలు అభిమానం చాటుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు 890 దాటింది. రాత్రి 8:30 వరకు వెయ్యి మంది రక్తదానానికి పేరు నమోదు చేసుకున్నారు. గత సంవత్సరం 750 మందికి పైగా రక్తదానం చేసి రికార్డు సృష్టించగా, ఈ రికార్డు బద్దలు కొట్టి వెయ్యి మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ఉమ్మడి జిల్లాలోనే మొదటిసారి రికార్డ్ అని వైద్యాధికారులు తెలిపారు. ప్రిన్స్ సిబ్బంది, ఏఎన్ఎంలు, వైద్యులు బ్లడ్ డొనేషన్ క్యాంపులో సహకారం అందించారు. రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, వైద్యులు పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. తన జన్మదినానికి అభిమానం ఆప్యాయతతో వచ్చిన ప్రతి ఒక్కరికి, రక్తదానం చేసిన దాతలు అందరికీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *