రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే సామాన్యులపై దాడులు చేస్తున్నారు
తన కారుకు ఎదురుగా వచ్చాడన్న కోపంతో ఓ బైకర్ పై దాడి చేసి బూట్ కాళ్లతో తొక్కిన ఎస్ఐ
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన మిడిదొడ్డి రంజిత్ అనే వ్యక్తి ఇంటికి వెళుతున్న క్రమంలో శాన్వి ఆసుపత్రి ముందర తన ఇంటి వైపు మల్లెక్రమంలో పానగల్ మండలం ఎస్ఐ కళ్యాణ్ రావు హౌసింగ్ బోర్డ్ నుండి TS 31D 4445 హుండై అమెజ్ అనే కారుతో అక్కడే యూటర్న్ తీసుకుంటుండగా ఇద్దరూ ఒకరికిఒకరు ఎదుర్పడ్డారు.
అయితే తన కారుకు అడ్డంగా నిలిపాడని బైక్ పై వచ్చిన అతనితో ఎస్ఐ వాదనకి దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఎస్ఐ కారులో నుంచి దిగి బైక్ పై వచ్చిన వ్యక్తి మీద దాడి చేశాడు.
నడిరోడ్డుపై కిందపడేసి పిడిగుద్దులు కురిపించాడు.. మరియు స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి మరోసారి దాడి జరిపినట్లు బాధితుడు ఆరోపించాడు