ఆవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను నాటే విధానాన్ని పరిశీలన
జిల్లా పాలనాధికారి రాజర్షి షా
ఉట్నూర్ లోని లక్కారం గ్రామపంచాయతీ లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆవెన్యూ Plantation ప్లాంటేషన్ మొక్కలను నాటే విధానాన్ని జిల్లా పాలనాధికారి రాజర్షి షా శుక్రవారం సాయంత్రం పరిశీలించి, రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటాలని అదేవిధంగా రక్షించాలని, పంచాయతీ కార్యదర్శి తో మాట్లాడుతూ 15 ఫైనాన్స్ డబ్బులు జమ అయ్యాయా అని అడగగా ఇంకా గ్రామపంచాయతీలలో జమ కాలేదని కార్యదర్శులు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాంప్రసాద్, అడిషనల్ డిఆర్డిఓ కుటుంబరావు, డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభాకర్ , మండలం పంచాయతీ అధికారి మహేష్ కుమార్, ఏపీవో రజినీకాంత్ టీ ఏ లు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.