పేకాట స్థావారం పై పోలీసుల దాడులు
ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
బేల మండలంలోని సదల్ పూర్ అటవీ ప్రాంతంలోని గుడిసెలు వేసుకొని పేకాట ఆడుతున్నారని పక్క సమాచారం మేరకు పేకాట స్థావరంపై శనివారం ఎస్ఐ రాధికా వారి సిబ్బందితో కలిసి దాడిచేసారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న పేకాట రాయులు వెంటనే పేకాట్ ముక్కలు పడేసి పారిపోయారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ .. పేకాట స్థావరంపై దాడి చేసే క్రమంలో వారు వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనాలను అక్కడే వదిలేసి పారిపోయారు. ఆరు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. ద్విచక్ర వాహనాల నంబర్ ప్లేట్ల ఆధారంగా వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని సూచించారు. మండలంలో పేకాట ఆడుతున్నట్లయితే వారి సమాచారం ఇవ్వాలని సూచించారు . సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు ఈ దాడుల్లో కానిస్టేబుళ్లు ఉన్నారు.