మొబైల్ హాట్స్పాట్ షేర్ చేసేందుకు నిరాకరించిన భార్య.. హత్య చేసిన భర్త
పోలీస్ అదుపులోకి భర్త
మొబైల్ హాట్స్పాట్ షేర్ చేసేందుకు భార్య నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన భర్త ఆమెను హత్య చేశాడు (Husband Kills Wife) ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. హర్యానాలోని రోహేక్ జిలాలో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. హర్యానాలోని రోహక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 30న మదీనా గ్రామానికి చెందిన అజయ్ కుమార్, అతడి భార్య రేఖ వారి ఇంట్లో మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఆ సమయంలో అజయ్ మొబైల్ డేటా అయిపోయింది. దీంతో మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేయమని భార్యను కోరాడు.కాగా, తన మొబైల్ డేటా తక్కువగాఉందని భార్య రేఖ చెప్పింది. హాట్స్పాట్ను ఆన్ చేసేందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన అజయ్ పదునైన ఆయుధంతో భార్యపై దాడి చేశాడు. ఆమెను హత్య చేసి ఇంటి నుంచి పారిపోయాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రేఖ కుటుంబం ఫిర్యాదుతో ఆమె హత్యపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న భర్త అజయ్ను అదే రోజు అరెస్ట్ చేశారు. రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు.