ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలు గన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కై ఆయన స్ఫూర్తితో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ పార్టీని స్థాపించి నేడు వాటి ఫలితాలను పొందడం జరిగిందన్నారు.
నేడు జై శంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తి ఉద్యమ ప్రతిమను స్మరించుకుంటూ బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కార్యకర్తలతో కలిసి స్థానిక జై శంకర్ sir విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. పూల మాలలు వేసి, గౌరవ వందనాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో సైతం ఆయన స్ఫూర్తితో తెలంగాణ హక్కులను కాపాడుకునే దిశగా సిద్ధంగా ఉంటామని తెలియజేశారు.