ఉద్యోగాలు సృష్టించలేని….వృద్ధి వ్యర్థమే: రంగరాజన్ Rangarajan

ఉద్యోగాలు సృష్టించలేని వృద్ధి వ్యర్థమేనని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ స్పష్టంచేశారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నదని కేంద్రం ఊదరగొడుతున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ప్రస్తుతం ఉద్యోగ కల్పన విషయం ప్రపంచ దేశాలకు సవాల్గా మారిందని, దీనిని గట్టెక్కడానికి తీవ్రంగా కృషి చేయాలని ఇక్ఫై ఫౌండేషన్ 14వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.భారత్ ద్రవ్యోల్బణం, రూపాయి-డాలర్ రేట్ వంటి సమస్యలతో సతమతమవుతున్నదని, అలాగే 6-7 శాతం వరకు వృద్ధిని సాధిస్తే తలసరి ఆదాయం 13 వేల డాలర్ల స్థాయికి చేరుకోవడం సులువవుతున్నదన్నారు. మరోవైపు, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో అత్యధిక దేశాలు తమ సొంత సరఫరా వ్యవస్థను మెరుగుపరుచుకోవడంతోపాటు కీలక వస్తువులను దిగుమతి చేసుకునేదానిపై పునరాలోచనలో పడ్డాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *