RIMS Director రిమ్స్ లో ఉచిత గుండె పరీక్ష వైద్య శిబిరం
రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్

ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి రిమ్స్ ఆస్పత్రిలోని డైస్ కేంద్రంలో నిర్వహించే ఉచిత పిల్లల గుండె వైద్య శిబిరం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ అన్నారు. మంగళవారం రిమ్స్ లోని డైస్ కేంద్రంలో హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు ఉచిత గుండె పరీక్ష వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, రిమ్ సూపరిండెంట్ డాక్టర్ అశోక్ లు కలిసి ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో నిర్వహించిన ఈ శిబిరానికి పట్టణంతో పాటు పరిసరాల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో గుండె సంబంధిత వ్యాధి పిల్లలను తీసుకువచ్చారు. పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ సుదీప్ వర్మ పిల్లలను పరీక్షించారు. టూడీ ఈకో ద్వారా పరీక్షించి పలువురిని హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి రేఫర్ చేశారు. ఈ సందర్భంగా పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ సుదీప్ వర్మ మాట్లాడుతూ…. ప్రతి వెయ్యి మందిలో 8 నుంచి పది మంది పిల్లలు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారన్నారు. ఇక్కడ పరీక్షలు చేసిన వారికి హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రిలో ఉచితంగా శాస్త్ర చికిత్సలు చేస్తామన్నారు. జిల్లా లోని పేద వారికి ఉచితంగా గుండే సంబందిత వ్యాధులకు చికిత్సలు అందించడానికి కలెక్టర్, వైద్య ఆరోగ్య. డైస్ కేంద్రం ద్వారా శిబిరాన్ని నిర్వహించడం సంతోషమన్నారు. బాదితులు శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో రిమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ చందు, డైస్ కేంద్రం ఇంచార్జీ మేనేజర్ Dr. రాధిక, ఫిజియో వైద్యులు నాగర్జున్, అడియోలజిస్ట్ శ్రీనివాస్, అప్తల్మాలజీస్ట్ సన, అధిత్య, ప్రవీణ్, ఉమకాంత్, ప్రశాంత్ తదితరులున్నారు.