judajuda

విధులు బహిష్కరించిన రిమ్స్ జూనియర్ డాక్టర్లు

అదిలాబాద్: రిమ్స్ జూనియర్ డాక్టర్లు బుధవారం విధులు బహిష్కరించి, నిరసన చేపట్టారు. వెస్ట్ బెంగాల్ లో ఇటీవల ఒక డాక్టర్ పై జరిగిన భయంకరమైన అత్యాచారం, హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రిమ్స్ జూడ అధ్యక్షుడు సందీప్ చారి మాట్లాడుతూ, మెడికల్ కళాశాలల్లో సరైన రక్షణ లేకపోవడం వల్ల వైద్యులు ఇలాంటి దాడుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సందీప్ చారి మాట్లాడుతూ, వెస్ట్ బెంగాల్ లో జరిగిన దారుణం కేవలం ఒక సంఘటన కాదు, ఇది దేశంలోని వైద్యుల కోసం ఒక హెచ్చరిక అని పేర్కొన్నారు., కానీ పోస్ట్మార్టం నివేదిక ప్రకారం డాక్టర్ పై గ్యాంగ్ రేప్ జరిగినట్లు స్పష్టమవుతోందన్నారు. దీనిపై యాజమాన్యం అసలు ఘటన చోటుచేసుకున్న ప్రదేశాన్ని కూల్చివేసే ప్రయత్నాలు చేస్తోందని, నిందితులను తప్పించడానికే ఇది చేయడం జరుగుతుందేమో అనే అనుమానం వ్యక్తం చేశారు.

ఒక్క నిందితుడిని మాత్రమే అదుపులోకి తీసుకోవడం సరిపోదని, గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వారందరినీ పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు కాపాడే వైద్యులకు సైతం రక్షణ లేకపోవడం ఎంత బాధాకరమో, ఈ ఘటన చూపిస్తోందని వ్యాఖ్యానించారు.

ఈ నిరసనలో జుడా సభ్యులు కరుణ్య, అన్వేష్, మౌనిక, సురజ్, రాజు తదితరులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *