సామల సదాశివ మాస్టార్ పేరున జిల్లా కేంద్రంలో అడిటోరియం ఏర్పాటు
చేనేత కార్మికులకు చేయూతనిచ్చేల ప్రతి ఒక్కరు కాటన్ దుస్తులను వినియోగించాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ అన్నారు. బుధవారం కొండలక్ష్మణ్ బాపూజీ చౌక్ లో జాతీయ చేనేత దినోత్సవంతో పాటు కేంద్ర సాహిత్య అకాడమి గ్రహిత దివంతగ సామాల సదాశివ్ మాస్టర్ వర్ధంతిని నిర్వహించారు. ముందుగా కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సామాల సదాశివ్ మాస్టార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులను సత్కరించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ మాట్లాడుతూ… చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేసేల ప్రజలు సహకరించాలన్నారు. కాటన్ దుస్తులను ధరిస్తు కార్మికులకు అండగా నిలవాలన్నారు. అదే విధంగా సాహిత్యంలో అనేక అవార్డులో పొందిన సామల సదాశివ మాస్టార్ పేరున జిల్లా కేంద్రంలో అడిటోరియం ఏర్పాటు చేయడంతో పాటు జయంతి, వర్థంతులను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కళాలు, కళాకారులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
చేతన రంగాన్ని అభివృద్ధి చేసేల ప్రతి ఒక్కరు సహకారం అందించాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ అన్నారు. బుధవారం కొండలక్ష్మణ్ బాపూజీ చౌక్ జాతీయ చేనేత దినోత్సవంతో పాటు కేంద్ర సాహిత్య అకాడమి గ్రహిత దివంతగ సామాల సదాశివ్ మాస్టర్ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోగౌరవ అధ్యక్షుడు కటకం రాందాస్,ప్రధాన కార్యదర్శి కామన్ విఠల్ ,కోశాధికారి బాస దత్తు , ఉపాధ్యక్షుడు ఆడేళ్లు ,మండల అధ్యక్షులు ఉషన్న ,కాసర్ల శ్రీనివాస్,రాజవర్ధన్,గంగన్న,ఆశన్న,సుధాకర్,జక్కుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు