షూటర్ సరబ్జోత్ సింగ్ కు ప్రధాని నరేంద్రమోదీ ఫోన్..
పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సరబ్జోత్ సింగ్ కు ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం ఫోన్ చేశారు. ఒలింపిక్స్లో పతకం గెలిచినందుకు అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ క్రీడా వేదికపై భారతదేశ మువ్వన్నెల జెండాను రెపరెపలాండించినందుకు ధన్యవాదాలు చెప్పారు. సరబీత్కు సంబంధించిన పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏకంగా 2.14 నిమిషాలపాటు వీరి సంభాషణ కొనసాగింది.
ఇవాళ జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్
ఈవెంట్లో షూటర్ సరబ్జోత్ సింగ్.. మహిళా
షూటర్ మను భాకర్తో కలిసి కాంస్య పతకం
సాధించాడు. ఈ పతకంతో కలిపి ఈ ఒలింపిక్స్లో
భారత్ సాధించిన పతకాల సంఖ్య రెండుకు
చేరింది. అంతకుముందు మహిళల 10 మీటర్ల
ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో మను భాకర్ కాంస్యంనెగ్గింది. దాంతో రెండు పతకాల్లో భాగస్వామ్యం ద్వారా మను భాకర్ చరిత్ర సృష్టించింది.