ఎస్సీ వర్గీకరణపై మంద కృష్ణ మౌనం వీడాలి
8, 9న జంతర్ మంతర్ వద్ద మహాధర్నా
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి
ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ మౌనంవీడాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీజేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. మాట్లాడుతూ…2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినవంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామన్నారని,రెండోసారి వచ్చిన తర్వాత కూడా ఆ అంశాన్నిపక్కన పెట్టారన్నారు.తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ వర్గీకరణ పేరుతో మరోసారి మభ్యపెట్టారన్నారు. మందకృష్ణ మాదిగ బీజేపీకి మాదిగల ఓట్లు వేయించారని, వారి ఓట్లతోనే రాష్ట్రంలో ఎనిమిది సీట్లు గెలిచిందన్నారు. ప్రస్తుతం, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో వర్గీకరణ బిల్లును ఎందుకు పెట్టడం లేదన్నారు.
మాదిగల ఓట్లు వేయించుకున్న ఇక్కడి బీజేపీ ఎంపీలు సైతం మౌనం వహిస్తున్నారనిఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లోపు వర్గీకరణ బిల్లు పెట్టకుంటే ఆగస్టు 8, 9 తేదీల్లో జంతర్ మంతర్ వేదికగా, పెద్ద ఎత్తున మాదిగలతో కలిసి మహాధర్నా, నిరసనలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను ఆహ్వానిస్తామన్నారు.