ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు దేశ ప్రజలకు న్యాయవ్యవస్థ పై మరింత నమ్మకన్ని పెంచిందదాని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అరెల్లి మల్లేష్ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా దేశంలో జరుగుతున్న పోరాటానికి సుప్రీంకోర్టు న్యాయమైన ముగింపునిచ్చినా సందర్బంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలతో టపాసులను పేల్చి మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా MRPS అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ మాట్లాడుతూ దండోరా ఉద్యమ 30 ఏండ్ల కల వర్గీకరణ అని, వర్గీకరణ లేక విద్య ,ఉద్యోగ రంగాలలో మాదిగలు మరియు ఉప కులాలకు ఇప్పటివరకు తీవ్ర అన్యాయం జరిగిందని సుప్రీంకోర్టు తీర్పుతో అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ల ఫలాలకు సార్ధకత దక్కుతుందని దీంతో ఎస్సీ జాబితాలోని అన్ని కులాలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల అందుతాయని అన్నారు. వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగన్న నాయకత్వంలో మాదిగ జాతి అలుపెరగని పోరాటం చేసిందని, దీనికి విద్యార్థి, ప్రజాసంఘాల సమస్త సమాజం మద్దతు ఉన్నదని అన్నారు.తక్షణమే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణను అమలు చేయాలని,తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం మాదిగలకు మరియు ఉపకులాలకు రావలసిన రిజర్వేషన్ల శాతాన్ని కేటాయించి వర్గీకరణ అమలు చేయాలని ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్ లలో రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలని దానికోసం అవసరమైతే ఆర్డినెన్స్ను తీసుకురావాలని రేవంత్ రెడ్డి ని కోరారు. తెలుగు రాష్ట్రాలలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వర్గీకరణ అమలు జరపాలని ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఇండ్ల ఎల్లన్న , సందూరి వినే య్ సాగర్ , టౌన్ నాయకులు టౌన్ నాయకులు మోడిపల్లి మనోజ్ , ఆరెపల్లి గణేష్ , పసుల వేణు , గారే రాములు , ఆయుష్ , బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మానాల శేఖర్, ప్రమోద్ , సుద్దాల శివకుమార్ , బొజ్జ మహేందర్ , సంతోష్ కుమార్ , కల్లెపల్లి నరేష్ , ఆరెల్లి గణేష్ , బాలే సంటేన్న , నవీన్, రాకేష్, వెంకటేష్ ప్రణయ్ వికాస్ తదితరులు పాల్గొన్నారు.