మంత్రి సీతక్కమంత్రి సీతక్క

పారిశుద్ధం పై ప్రత్యేక దృష్టి సాధించాలి

వర్షాకాలం లో సీజనల్ వ్యాధులు రాకుండా
అధికారులు అప్రమత్తం గా ఉండాలి

ఇంఛార్జి మంత్రి సీతక్క

మంత్రి సీతక్క
మంత్రి సీతక్క

 

సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో పంచాయితీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ, గృహనిర్మాణ శాఖ, ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క (అనసూయ) ఇంఛార్జి మంత్రి సీతక్క పారిశుద్ధ్యం పై సంబంధిత అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పి గౌస్ ఆలం, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ తో కలసి నిర్వహించిన సమావేశం నిర్వహించారు. స్వచ్ఛధనం పచ్చదనం ప్రత్యేక 5 రోజుల కార్యక్రమంలో చేపట్టిన పారిశుద్ధ్య పనుల ప్రగతి పై సమీక్షించారు .

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై, వరదలు విష జ్వరాలు హాస్టల్స్ స్కూల్ లలో సమస్యలు, మిషన్ భగీరథ ,వైద్యం మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడి కేంద్రాల పై శాఖల వారీగా సమీక్షించడం జరిగిందన్నారు.మహిళ శిశు సంక్షేమ ద్వారా సరఫరా అవుతున్న పౌష్టికాహారం, గుడ్లు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించి, నాణ్యమైన ఆహారం అందించాలని, కుళ్లిపోయిన గ్రుడ్లు తీసుకోకుండా, నాణ్యమైన గ్రుడ్లు తీసుకునేలా సూపర్వైజర్ చర్యలు చేపట్టాలని, గ్రామాలలో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రత్యేక అధికారులుగా నియమించిన అధికారులు ప్రతిరోజు ఫీల్డ్ కి వెళ్లాలని పట్టణాలలో గ్రామాల్లో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించి, వ్యాధులు రాకుండా చూడాలని, పారిశుద్ధ్య కార్యక్రమం నిరంతర ప్రక్రియ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత పాటించాలని స్వచ్ఛదనం పచ్చదనం ప్రతీ నెల జరగాలని, డెంగ్యూ , మలేరియా, వ్యాధులు దోమలు, ఈగలు రాకుండా గ్రామాల్లో పట్టణాలలో అవగాహన కల్పించాలని, మున్సిపాలిటీలలో మార్కెట్ ఏరియా దుకాణాలలో తదితర ఏరియాలలో పారిశుధ్యం పై చర్యలు చేపట్టాలని ముఖ్యంగా తాగునీరు పై శ్రద్ధ వహించి సంపు , ట్యాంక్ లను 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలని ఆన్నారు.

అధికారులు మార్నింగ్ వాక్ వెళ్లకుండా ప్రతిరోజు ఉదయం గ్రామాలలో పర్యటించి అక్కడి గ్రామపరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అన్నారు, హాస్టల్స్ వార్డెన్ లతో మీటింగ్ ఏర్పాటు చేయాలని హాస్టల్స్ లో స్ప్రే చేయడం పరిసరాలు శుభ్రంగా ఉంచడం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పాములు, తెళ్ళు రాకుండా, చుట్టుపక్కల శుభ్రం చేయించుకోవాలని అన్నారు .వారానికి ఒకసారి శ్రమదానం చేయాలని , వంటగది శుభ్రం చేసుకోవాలనీ, త్రాగునీరు పారిశుద్ధ్యం పై సంబంధిత ప్రత్యేక అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని, వర్షాకాలం వెళ్లే వరకు తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.జిల్లాలో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ జిల్లాను ప్రగతిపథంలో నిలుపుతూ ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని ఆన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *