సీతారామ ప్రాజెక్టులో మరో సక్సెస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పుసుగూడెం పంపు హౌస్ ట్రయల్ రన్ విజయవంతం.
సీతారామలో రెండు పంపు హౌస్ ల ట్రయల్ రన్ సక్సెస్
అన్ని అనుకూలిస్తే ఈ నెలలోనే కృష్ణ ఆయకట్టుకు గోదావరి జలాలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారి పల్లి నుంచి నీటిని ఎత్తిపోసి పాలేరు జలాశయంకు అనుసంధానం చేయాలని సంకల్పించిన కేసీఆర్.
సాగర్ ఎడమ కాల ద్వారా ఖమ్మం జిల్లాలో సాగవుతున్న కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు తరలించాలనేది సీతారామ ప్రాజెక్టు లక్ష్యం.
గతంలోనే పంప్ హౌస్ లో నిర్మాణం, 70 శాతానికి పైగా కాలువల నిర్మాణం పూర్తిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.
ప్రస్తుతం ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ నింపి సత్తుపల్లి , వైరా ప్రాంతానికి నీళ్లు ఇవ్వబోతున్న కొత్త సర్కార్.
రెండు పంప్ హౌస్ ల ట్రయల్ రన్ విజయవంతం. రేపోమాపో మూడో పంపు హౌస్ ప్రారంభించనున్న అధికారులు..