ఎస్పీ గౌష్ ఆలంఎస్పీ గౌష్ ఆలం

అదిలాబాద్ జిల్లాలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆధ్వర్యంలో ర్యాగింగ్, సైబర్ క్రైమ్, డ్రగ్స్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ సంబంధిత అంశాలను, ముఖ్యంగా ఓటీపీ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, పోలీస్ డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ వంటి మోసాలను విద్యార్థులకు వివరించారు. సెక్యూరిటీ లేనటువంటి అప్లికేషన్లను మొబైల్ ఫోన్లో వినియోగించకుండా ఉండాలని, సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండటానికి తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించారు. అత్యవసర సమయాల్లో స్పందించడానికి సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 మరియు సంబంధిత వెబ్‌సైట్లను విద్యార్థులకు తెలియజేశారు.

డ్రగ్స్ వినియోగంపై అవగాహన కలిగించేందుకు, డ్రగ్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు మరియు నేరపరమైన ప్రభావాలను కూడా విద్యార్థులకు వివరించారు. అదిలాబాద్ జిల్లా గంజాయి రహిత జిల్లాగా మారేందుకు పోలీసులు చేస్తున్న కృషిని వివరించారు. ప్రత్యేక కిట్స్ ద్వారా గంజాయి వినియోగదారులను గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు.

ర్యాగింగ్ చట్టరీత్యా నేరం అని, సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరం అని, దీనికి సంబంధించిన శిక్షలను విద్యార్థులకు వివరించారు. ఎవరైనా ర్యాగింగ్ బాధితులు అయితే, యాంటీ ర్యాగింగ్ టోల్ ఫ్రీ నెంబర్లు మరియు వెబ్సైట్లను ఉపయోగించి సహాయం పొందాలని సూచించారు.

కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, హసీబుల్లా, బి సురేందర్ రెడ్డి, టీఎస్ న్యాబ్ టిఎస్పి ఎం పద్మనాభం, రిమ్స్ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్, సూపరిండెంట్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, సిఐలు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *