శ్రీశైల మల్లన్నకు రూ.3.91 కోట్ల ఆదాయం..
127 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 4.400 కేజీల వెండి ఆభరణాలు
శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. క్షేత్రంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో పటిష్ఠ నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బందితోపాటు శివసేవకులు ఉభయ దేవాలయాలు మరియు పరివార దేవతాలయాల హుండీలను లెక్కింపు చేశారు. గత 29 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ.3,31,70,665 ఆదాయం వచ్చిందని దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు. 127 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 4.400 కేజీల వెండి ఆభరణాలు కూడా లభించాయని ఈఓ పెద్దిరాజు చెప్పారు. వీటితోపాటు 489 అమెరికా డాలర్లు, 20 సింగపూర్ డాలర్లు, ఐదు యూరోలు, 4,445 యూఏఈ దీర్ఘామ్స్, ఒక మలేషియా రింగేట్స్, 108 ఖతార్ రియాల్స్, 15 సౌదీ అరేబియా రియాల్స్, ఐదు లక్షల వియత్నాం డాంగ్స్, 20 ఇంగ్లాండ్ పౌండ్లు, 90 థాయిలాండ్ పౌండ్లతోపాటు వివిధ దేశాల కరెన్సీని భక్తులు స్వామి అమ్మవా