వివాదాస్పదం.. తాజ్మహాల్లో గంగా జలం పోశారు
వివాదాస్పదమైన యువకుల చర్య తమ సభ్యుల పనేనన్న హిందూ మహాసభ (TajMahal)
Taj Mahal | ఆగ్రా, ఆగస్టు 3: ఆగ్రాలోని తాజ్‌మహల్‌లో శనివారం జరిగిన ఓ ఘటన వివాదాస్పదంగా మారింది. ఇద్దరు యువకులు ప్లాస్టిక్ సీసాలతో నీళ్లు తీసుకువచ్చి,తాజ్మహల్లోని ప్రధాన సమాధి ఉన్న సెల్లార్ వద్ద పోశారు. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై వినేశ్ చౌదరి, శ్యామ్ కుమార్ అనే ఇద్దరు యువకులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాగా, తమ సభ్యులు తేజో మహాలయ(తాజ్ మహాల్‌ను పలు హిందూ సంస్థలు పిలుస్తున్న పేరు)లో గంగా జలాన్ని సమర్పించినట్టు ఆల్ ఇండియా హిందూ మహాసభ (ఏఐహెచ్ఎం) అధికార ప్రతినిధి సంజయ్ జాట్ ప్రకటించారు.