TSUTFTSUTF

కోల్‌కతా RG కార్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం మరియు హత్య ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర కార్యదర్శి ఏ వెంకట్ మాట్లాడుతూ, దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ ఘోర సంఘటనకు నిరసనగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ, TSUTF జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా, జూనియర్ డాక్టర్ల నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన వారు, ఈ సంఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరారు.

దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ కల్పించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఈ నిరసనలో పాల్గొన్న నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఏ స్వామి, ప్రధాన కార్యదర్శి వి అశోక్, కోశాధికారి కె కిష్టన్న, జిల్లా కార్యదర్శులు ఎ ఇస్తారి, కె శ్రీనివాస్, గౌస్ మొహియుద్దీన్, సి విలాస్, ఇ శివన్న, కె శంకర్, మహిళా ప్రతినిధులు కె శ్రీలత, ఆర్ మీరా, డి రజిని, అనిత, శ్రీవాణి, సువర్ణ, సరిత, శివలీల, మరియు వివిధ మండలాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *