వరద బాధితులకు విరాళాల సేకరణ
సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్*
……………………………………..
కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లో వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది మరణించి, వాయనాడ్ వరద వేలాది మంది నిరాశ్రయులు అయినందున కేంద్రం వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించి వాయనాడ్ ప్రజలను ఆదుకోవాలని సిపిఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా పార్టీ ఆధ్వర్యంలో వరద బాధితులకు ప్రజలనుండి రూపాయలు 8800 విరాళాలు సేకరించి పార్టీ రాష్ట్ర కమిటీ ద్వారా వరద బాధితులకు పంపించారు. ఈ ఈ సందర్భంగా వరద బీభత్సంతో వాయనాడ్ అతలాకుతలం అయ్యింది అన్నారు . పర్యాటక కేంద్రంగా ప్రఖ్యాతి గాంచిన వాయనాడ్ ఇలాంటి స్థితిలో ఉండటం బాధాకరం అన్నారు . ఈ సమయంలో కేరళకు అండగా నిలబడాల్సిన కేంద్ర ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తుందని మండి పడ్డారు . వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించి వాయనాడ్ ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంక రాఘవులు , అన్నమొల్ల కిరణ్ ,పూసం సచిన్ సీనియర్ నాయకులు బండి దత్తాత్రి , జిల్లా కమిటీ సభ్యులు ఆర్ .మంజుల , నాయకులు అగ్గిమల్ల స్వామి ,ధొనిపెల్లి స్వామి , ఎన్ .స్వామి , పండుగ పొచ్చన్న , అన్నమొల్ల రూప , ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు .