గృహిణిని బెదిరించి.. 40 లక్షలు కాజేశారు
మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం’ అంటూ బెదిరించారు
మీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.. మేం చెప్పినట్లు చేయకపోతే.. మహారాష్ట్ర మాజీ సీఎంకు సంబంధించిన ముఠాతో సంబంధాలున్నాయంటూ కేసులు నమోదు చేస్తాం’.. అంటూ ఓ గృహిణిని బెదిరించి.. రూ. 40 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. సదరుమహిళకు తాము ఫెడెక్స్ నుంచి కాల్ చేస్తున్నామంటూ మాట్లాడిన నేరస్తులు..
‘మీ పేరుతో ఉన్న పార్సిల్లో ఎండీఎంఏ డ్రగ్స్ ఉంది.. ముంబై పోలీసులకు కాల్ బదిలీ చేస్తున్నాం’ అని చెప్పారు. ఆ తర్వాత తాము ముంబై పోలీసులమని చెబుతూ.. ఓ ఫొటోను పంపించారు. అది మహారాష్ట్ర మాజీ సీఎం ఫొటో అని చెబుతూ.. ‘అతనికి ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. మీకు ఆ గ్యాంగ్లతో సంబంధముంది. అలాగే హత్య కేసుల్లోనూ సంబంధాలున్నాయి..
మీది, మీ కుటుంబ సభ్యులు, బంధువుల బ్యాంకు ఖాతాలు సీజ్ చేసి.. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం’ అంటూ బెదిరించారు. కంగారుపడిన బాధితురాలు.. రూ. 40 లక్షలు రెండు దఫాలుగాసైబర్ నేరగాళ్లు సూచించిన బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేసింది. కాల్ కట్కాగానే ఇదంతా మోసమని గుర్తించి.. సైబర్ క్రైమ్ కాల్సెంటరు ఫోన్ చేసి, సీసీఎస్ సైబర్ప్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.