ప్రేమంటే అంటే ఉండాలి …
చెట్టుకు భర్త డ్రెస్ తొడిగి జయంతి
వినూత్నంగా చెట్టుకు పుట్టినరోజు,
చనిపోయిన భర్త జ్ఞాపకాలను చెట్టు లో చూసుకుంటూ ఏటా జయం తి చేస్తున్నది వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి. సోమవారం తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఓ చెట్టుకు చనిపోయిన తన భర్త డ్రెస్ వేసి వినూత్నంగా చెట్టుకు పుట్టినరోజు,
భర్తకు జయంతిని నిర్వహించింది. ఎనిమిదేండ్ల క్రితం విజయలక్ష్మి భర్త వెంకటయ్య అనారోగ్యంతో ఉండగా, తన ఇంటి ఎదుట మొక్క నాటారు. ఆయన మరణానంతరం విజయలక్ష్మి ఆ మొక్కను జాగ్రత్తగా పెంచుతున్నారు. ఆ మొక్క ఇప్పుడు చెట్టయ్యింది. ఏటా కుటుంబసభ్యులతో కలిసి ఆ చెట్టుకు బెలూన్స్ కట్టి పుట్టినరోజు వేడుక నిర్వహిస్తున్నది. నేషనల్ హైవే వెడల్పులో భాగంగా విజయలక్ష్మి ఇంటి ముందున్న చెట్టును అధికారులు తొలగించే ప్రయత్నం చేయగా.. ఆమె వ్యవసాయ శాస్త్రవేత్తల అనుమతితో చెట్టును జేసీబీ సహాయంతో అక్కడికి తీసుకెళ్లి నాటారు. దీంతో ఆ చెట్టుకు పూజలు చేసి, పంచభక్ష పరమాన్నాలు పెట్టి వేడుక నిర్వహించింది.