విద్యాసామర్ధ్యాల పెంపుదలకు ఉపాధ్యాయులు కృషి చేయాలి.-డిఈఓ టి.ప్రణీత ఉపాధ్యాయులు విద్యాసామర్ధ్యాల పెంపుదలకు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి టీ.ప్రణీత అన్నారు.

ఈరోజు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ (2) లో ఆదిలాబాద్ (అర్బన్), మావల మండలాలలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పాఠశాల సముదాయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి టీ.ప్రణీత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సామర్థ్యాలను ఉపాధ్యాయులు వెలికి తీయాలన్నారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్షకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని కోరారు. అవసరమైతే ప్రత్యేక తరగతుల ద్వారా విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దాలన్నారు.NAS పరీక్షలో జిల్లా ముందు వరుసలో ఉండాలని సూచించారు. విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తుమ్మ లచ్చిరాం, సెక్టోరిల్ అధికారి శ్రీకాంత్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్, రిసోర్స్ పర్సన్ లు వెంకటేష్ ,రాజేశ్వర్ ,అశ్విని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *