కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసిన – ఎంపీ నగేష్.
ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ ఆర్మూర్ నుండి అదిలాబాద్ వయా నిర్మల్ ను త్వరగా సర్వే పనులు పూర్తీ చేసి మంజూరీ ఇవ్వాలని విన్నవించారు. అదేకాకుండా ఆసిఫాబాద్ రోడ్ రెబ్బెన యందు గల GATE NO 71 ROB మంజూరు చేయాలని విన్నవించారు.
ఈ రైల్వే లైన్ చేయడం వలన నిర్మల్ అదిలాబాద్ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మరియు హైదరాబాద్ మరియు నాగ్ పూర్ కు వెళ్లేందుకు సౌలభ్యంగా ఉంటుంది. వ్యాపారాలు విస్తరించేందుకు అవకాశం ఉంటుంది. ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అని తెలిపారు.
ఆసిఫాబాద్ రోడ్డు రెబ్బన Gate.No.71 వలన గంగపూర్ మరియు దహెగాం, బెల్లంపల్లి, మండలాలకు ఉపయోగపడుతుందని తెలిపినారు.
రైల్వేశాఖ మంత్రి గారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.