ప్రాణంపెట్టి పనిచేయడంవల్లే ఈ విజయం

కృష్ణవంశీ, మోక్ష జంటగా రూపొందిన చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్రెడ్డి దర్శకుడు. హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మాతలు. శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ థ్యాంక్స్మిట్ నిర్వహించింది. ‘ప్రేక్షకదేవుళ్లని ఎందుకంటారో మా సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే అర్థమైంది.తొలి సినిమాకు ఇంతమంచి కేరక్టర్ దొరకడం నిజంగా అదృష్టం. ఆ అదృష్టాన్నిచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. మోక్ష బెస్ట్ కోస్టార్. అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు కాబట్టే ఈ విజయం’ అని హీరో కృష్ణవంశీ ఆనందం వెలిబుచ్చారు. దర్శక,నిర్మాతలు పాషన్తో తీసిన సినిమా ఇదని, ఇందులో తాను చేసిన ధరణి పాత్ర తన ఒరిజినల్ కేరక్టర్కి దగ్గరగా ఉంటుందని కథానాయిక మోక్ష చెప్పారు. సినిమా విజయం పట్ల దర్శక, నిర్మాతలు ఆనందం వెలిబుచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *