శ్రీ శ్రీ శ్రీ పరమహంస సచ్చిదానంద సద్గురు శ్రీ శబరి మాతజి గారి దివేనలతో తలమడుగు మండలంలోని అర్లి గ్రామంలో 24 సంవత్సరాల తర్వాత ఈరోజు అఖండ జ్యోతి కార్యక్రమాన్ని గ్రామస్తులు నెల రోజుల పాటు పెద్దఎత్తున నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా గౌరవ గౌరవ బోథ్ శాసన సభ్యులు అనిల్ జాధవ్ గారు మాజీ మంత్రి జోగు రామన్న గారు మరియు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అనిల్ జాధవ్ గారికి జోగు రామన్న గారికిగ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పల్లకి యాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గౌరవ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారు మాట్లాడుతూ శబరిమాత ఆశీస్సులతో 24 సంవత్సరాల తర్వాత నిర్వహించిన అఖండ జ్యోతి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్న అన్నారు. ఈ ఆన్లైన్ కాలంలో కూడా ఇంత భక్తితో ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అందరూ కలిసి నెల రోజుల పాటు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. శ్రీ శబరిమాత ఆశ్రమానికి ఎలాంటి సమస్య వచ్చినా తనకు సంప్రదించాలని కోరారు. శబరిమాత ఆశిస్సులతో ఈరోజు ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.