యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్ ఘడ్ చెందిన యువతికి హైదరాబాద్ లో ఉంటున్న స్వామి అనే వ్యక్తితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరగడంతో ఆస్ట్రేలియా వెళ్తున్నట్లు నమ్మించిన స్వామి.. ఆమెను హైదరాబాద్ కు రప్పించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి అడగడంతో ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నించగా.. అతడి ప్రవర్తన పట్ల అనుమానం వచ్చిన యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.