ఐక్యంగా ఉంటూ రాజ్యాధికారం దిశాగా సాగాలి
పీఎం విశ్వకర్మ యోజనను పథకాన్ని సద్వినియోగo చేసుకోవాలి – MLA Payal Shankar
ఎమ్మెల్యే పాయల్ శంకర్
అధిక జనాభా ఉన్న బీసీలు ఐక్యంగా ఉంటూ రాజ్యాధికారం దిశాగా సాగాలని ఎమ్మెల్యే పాయల శంకర్ పిలుపు నిచ్చారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్యాంక్ అధికారులు దరఖాస్తు చేసుకునే విదానంతో పాటు బ్యాంకు సేవల గురించి తెలియజేశారు. దీనికి ఎమ్మెల్యే పాయల శంకర్ ముఖ్య అథితిగా హాజరై కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టి పథకాల గురించి వివరిస్తు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బీసీల అభ్యున్నతికి అసెంబ్లీలో ప్రస్తవించడం జరిగిందని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. ఇది బీసీ బిడ్డను గెలిపించి అసెంబ్లీకి పంపడంతోనే సాధ్యమైందన్నారు. కుర్చొవడానికి కాకుండా రాజ్యాధికారం సాధించేలా కుర్చీలను అడిగేల బీసీలు ఎదగాలన్నారు. బీసీలు ఆర్థికంగా స్థిరపడాలంటే బ్యాంకులు జమిన్. సిబిల్, సీఏలు ఉంటేనే రుణాలు ఇస్తున్నాయన్నారు. ఈ పరిస్థితి రాకుండా కేంద్ర ప్రభుత్వం, పీఎం నరేంద్ర మోడీ విశ్వకర్మలకు ఎలాంటి జమీన్ లేకుండా రుణాలను అందించేలా పీఎం విశ్వకర్మ యోజనను తీసుకువచ్చారన్నారు. దరఖాస్తులు చేసుకున్న తరువాత ఎన్నికల రావడంతో ఆలస్యం అయిందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి లబ్దిదారుడికి విశ్వకర్మ యోజన కింద రుణాలు మంజూరు చేసేల కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి చిక్కాల దత్తు. కలాల శ్రీనివాస్, బీజేపీ జిల్లా కార్యదర్శి ఆధినాత్, పీఎం విశ్వకర్మ సీఎస్సీ స్టేట్ హేడ్ రాజేందర్, సోషల్ మెంబర్ శ్రీనివాస్, ఎస్బీఐ బిస్ నెస్ కరస్పండెంట్ అంబజీ, బీసీ సంఘం, బీజేపీ నాయకులు మెహన్ బాబు, ఎన్నవార్ రాజు, ధోని జ్యోతి తదితరులు పాల్గొన్నారు.