నిర్భయ తరహాలో తెలంగాణలో ఘటన

కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం..

తెలంగాణా రాష్ట్రం నిర్మల్ జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో నీ ప్రకాశం జిల్లా కు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం.. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశారని బాధిత మహిళ డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేసింది.దీంతో అప్రమత్తమైన పోలీసులు ఓయూ పీఎస్ సమీపంలో బస్సును ఆపి సీజ్ చేశారు. హరికృష్ణ ట్రావెల్ సంబంధించిన ఇద్దరు డ్రైవర్లు ఉండగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో డ్రైవర్ (ప్రధాన నిందితుడి) కోసం గాలిస్తున్నట్లు సీఐ రాజేందర్ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *