ఓదెల 2 నుంచి స్పెషల్ పోస్టర్ ..
ట్రోల్ అవుతున్న పోస్టర్
సినిమా అప్డేట్…

Odela 2 | మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓదెల 2 (Odela 2). ఓదెల సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) కథను అందిస్తుండగా.. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవ్వడానికి సిద్దం అవుతుంది. అయితే హైదరాబాద్ ఆషాడ బోనాల పండుగ సందర్భంగా చిత్రబృందం పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో తమన్నా బోనం (Bonam) ఎత్తుకుని వస్తున్నట్లు పోస్టర్ ఉంది. కాగా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో తమన్నా శివశక్తి అనే పాత్రలో నటిస్తుండగా.. మహదేవు పరమభక్తురాలిగా కనిపించనుంది. ఓదెల సద్గుణ రక్షకురాలిగా ఇందులో కనిపించనుంది. ఓదెల 2 చిత్రంలో వశిష్ఠ ఎన్ సింహా, హరిప్రియ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్, మధు క్రియేషన్స్పై తెరకెక్కిస్తున్నారు. కాంతార చిత్రానికి గూస్బంప్స్ తెప్పించే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చిన అజనీష్ లోక్నాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఓదెల 2 షూటింగ్ను ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాశీలో మొదలుపెట్టారని తెలిసిందే. ఈ ఫొటోలు ఇప్పటికే ఆన్లైన్లో హల్ చల్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *