Shraddha Kapoor | బాలీవుడ్ అందాల భామ శ్రద్ధా కపూర్ రీసెంట్గా తన పాత ఇంటిని రీnovation చేయించడానికి కొత్త అద్దె ఇంటికి షిఫ్ట్ అయ్యింది. ముంబై జుహూ ప్రాంతంలో ఉన్న తండ్రి శక్తికపూర్ ఇంటిని 1987లోనే కొనుగోలు చేశారు. 37 సంవత్సరాలుగా పటిష్టంగా ఉన్న ఆ ఇల్లు, పాతకాలం డిజైన్ల కారణంగా, శ్రద్ధా మోడ్రనేట్ చేయాలని నిర్ణయించుకుంది.
తండ్రి అనుమతితో ఇంటి రీnovation పనులు ప్రారంభించి, ఇంటిని ఖాళీ చేసి, హృతిక్ రోషన్ ఇంట్లోకి అద్దెకు దిగింది. ఈ కొత్త ఇల్లు జుహూ ప్రాంతంలోనే, బీచ్‌కి అభిముఖంగా ఉన్న హృతిక్ రోషన్ ఇంట్లోకి రీnovation పూర్తయ్యే వరకు ఆమె నివసిస్తుంది. ఆసక్తికరంగా, సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఇల్లు కూడా అదే ప్రాంతంలో ఉండటం విశేషం.
ఇదిలా ఉంటే, శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ‘స్త్రీ 2’ చిత్రం ఇప్పటికే 500 కోట్ల క్లబ్లో చేరి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా కోసం శ్రద్ధాకు భారీ రెమ్యునరేషన్ తో పాటు, సినిమా లాభాల్లోనుంచి కూడా కొంత వాటా ఇవ్వాలని నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం. శ్రద్ధా కపూర్ ఈ కొత్త ప్రయాణంలో కూడా విజయవంతం అవుతుందనడంలో సందేహం లేదు.