జూలై నెల లో రూ.1,82,075 కోట్ల జీఎస్టీ వసూళ్లు
జీఎస్టీ వసూళ్లలో 10.3 శాతం వృద్ధిరేట్
GST Collections | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో జూలై నెల జీఎస్టీ వసూళ్లలో 10.3 శాతం వృద్ధిరేట్ నమోదైంది. గత నెలలో రూ.1,82,075 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. మరోవైపు రీఫండ్స్ 14.4 శాతం పెరిగి రూ.1,65,793 కోట్లకు చేరాయి. ఏప్రిల్ -జూలై మధ్య కాలంలో జీఎస్టీ వసూళ్లు రూ.6.56 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి నమోదైంది. ఏప్రిల్ నెలలో గరిష్టంగా రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలవారీగా జీఎస్టీ వసూళ్ల వివరాలను అధికారికంగా వెల్లడించడం నిలిపేసింది.